మనం ‘ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్’ (Equity Mutual Funds) గురించి చర్చించుకునేటప్పుడు ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్ విలువ (market capitalization) పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సింపుల్ పదాలలో చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజీలో కంపెనీ ట్రేడ్ చేసే మొత్తాన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటారు. మార్కెట్ విలువ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి లార్జ్-క్యాప్ (large-cap), మిడ్-క్యాప్ (Mid-Cap), స్మాల్ – క్యాప్ (Small-cap) ఇంకా మల్టీ-క్యాప్ (Multi-cap)లుగా వర్గీకరించబడతాయి. ఈ స్టోరీలో మనం SMALL CAP FUND అంటే ఏంటి? వీటి పరిధి ఎంత? పెట్టుబడులు పెట్టొచ్చా? రిస్క్ ఎంత.. లాభమెంత వంటి వివరాలను తెలుసుకుందాం.
SMALL CAP FUNDS అంటే ఏంటంటే?
స్మాల్-క్యాప్ ఫండ్స్ (Small-Cap Funds) తమ పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని స్మాల్ క్యాప్ కంపెనీలకు సంబంధించిన ఈక్విటీలకు కేటాయించాలి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధనల ప్రకారం, స్మాల్ క్యాప్ స్కీమ్స్ తమ దగ్గర ఉన్న మొత్తం నిధుల్లో 80 శాతం వరకు నిధులను స్మాల్ క్యాప్ తరగతికి చెందిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెబీ నియమాల ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 250 కంటే దిగువ ర్యాంకుల్లో ఉన్న కంపెనీలను స్మాల్-క్యాప్ కంపెనీలుగా పరిగణిస్తారు. ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.5000 కోట్ల కంటే తక్కువగానే ఉండాలి.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? స్మాల్-క్యాప్ ఫండ్స్ అనేవి ‘హై-రిస్క్’ క్యాటగిరీ కిందకు వస్తాయి. ఈ ఫండ్స్ వల్ల లాభాలు ఏ విధంగా వస్తాయో.. నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లు చిన్నపాటి ఒత్తిడికి లోనైనా స్మాల్-క్యాప్ కంపెనీలకు సంబంధించిన షేర్లు డౌన్ ఫాల్ అయ్యే ప్రమాదముంటుంది. అవి తిరిగి కోలుకోటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మార్కెట్‌పై పూర్తిస్థాయి అవగాహనతో మాత్రమే స్మాల్-క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సాధారణంగా ఏ కంపెనీ అయినా చిన్నగా తమ జర్నీని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పెద్దగా ఎదుగుతుంది. ఇటువంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలను ఆర్జించే అవకాశముంటుంది.
Small Cap Funds వల్ల చేకూరే ప్రయోజనాలేంటి?
బలమైన వృద్ధి సామర్థ్యం కారణంగా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ అధిక రాబడులను అందించగలవు. వీటిని ఎంపిక చేసుకునే విషయంలో రిస్క్ ఫ్యాక్టర్‌ను కూడా గమనించుకోవాలి.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన నెట్ అసెట్ వాల్యూ (Net asset value) అనేది చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్ స్థితిగతులను బట్టి వీలైనన్నీ ఎక్కువ యూనిట్స్ కొనుగోలు చేసే వీలుంటుంది. తద్వారా లాభాలను కూడా అదే విధంగా ఆర్జించేందుకు వీలుంటుంది.
ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యతను కోరుకునే వారు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనా పెట్టబడి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండే ఇన్వెస్టర్లకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చక్కటి ఎంపిక. మార్కెట్ ఆశాజనకంగా ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఊహించని లాభాలను అందిస్తాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ ఫాల్ అయితే ఫండ్స్ అదే స్థాయిలో కుప్పకూలతాయి.

Small Cap Funds గురించి తరచుగా అడిగే ప్రశ్నలివే
1.) Small Cap mutual Fund అంటే ఏంటి?
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. వీటిని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. రూ.5000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ విలువను కలిగి ఉన్న కంపెనీలను Small Cap Firms అంటారు.
2.) Small Cap mutual Fundsలో పెట్టుబడులు పెట్టడం వల్ల చేకూరే ప్రయోజనాలేంటి?
Small Cap mutual Fundsలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను పొందే అవకాశముంటుంది.
3.) Small-Cap ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రధాన రిస్క్ ఏంటి?
Small Cap Fundsకు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే? వీటి ధరలు స్థిరంగా ఉండవు. తరచూ ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటుంటాయి.
4.) Small-Cap ఫండ్స్‌లో ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు?
మార్కెట్ రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం చూసే వారు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు.
5.) Small Cap, Mid-cap మ్యూచువల్ ఫండ్స్ మధ్య తేడాలంటే?
మన దేశంలో ఫండ్స్‌ను వాటి మార్కెట్ విలువను బట్టి large cap, Mid cap, Small Capలుగా వర్గీకరించడం జరిగింది. large cap ఫండ్స్ అనేవి పెద్ద మొత్తంలో మార్కెట్ విలువను కలిగి ఉంటాయి. Mid cap ఫండ్స్ మార్కెట్ విలువ మధ్యస్తంగా ఉంటుంది. అదే విధంగా Small Cap ఫండ్స్ మార్కెట్ విలువ రూ.5000 కోట్లకు దిగువున ఉంటుంది.