SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఒక మార్గం. ఇందులో మీరు సులభమైన వాయిదాలలో పెట్టుబడి చేయవచ్చు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. ఇందులో మీరు కనీసం రూ. 100 నుంచి పెట్టుబడులను ప్రారంభించవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని నెలవారీ చెల్లించవచ్చు.క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది ఒక మంచి ఎంపిక.

రిస్క్ తక్కువ భరోసా ఎక్కువ
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీని కోసం మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం.ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ బ్యాంకు ఖాతా సిప్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. మీరు పెట్టుబడి కోసం ఎంచుకున్న ప్లాన్ ప్రకారం, నిర్దిష్ట తేదీలో ఆ ఖాతా నుంచి డబ్బు సిప్ ఖాతాలో జమ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లోని ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయడం ద్వారా రిస్క్ తక్కువగా ఉంటుంది.