దేశంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల (Asset Management Companies) జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ హౌస్’. ఓ రిసెర్చ్ ప్రకారం ఈ ఫండ్ హౌస్ దాదాపు పదకొండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల పది (రూ.11,09,710) కోట్ల ఆస్తులను కలిగి ఉంది.
ఈక్విటీ, హైబ్రిడ్, డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగాల్లో 123కుపైగా స్కీమ్స్‌ను SBI మ్యూచువల్ ఫండ్ హౌస్ విజయవంతంగా రన్ చేస్తోంది. వీటిలో అత్యధిక శాతం స్కీమ్స్ వాటి వాటి లక్ష్యాలను చేరుకుని ఇన్వెస్టర్లకు లాభాల పంట పంట పండిస్తున్నాయి. గడిచిన 15 సంవత్సరాల కాలంగా అత్యధిక వార్షిక రాబడిని అందిస్తున్న 6 SBI మ్యూచువల్ ఫండ్స్ వివరాలను ఈ కథనంలో మీ ముందుంచుతున్నాం.
ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ (SBI Small Cap Fund)
సెప్టెంబర్ 2009లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ అప్పటి నుంచి ప్రతి ఏటా స్థిరంగా 20.74 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ నికర ఆస్తి విలువ రూ.179.7408 కాగా నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.33,285 కోట్లుగా ఉంది. 1.57 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉన్న ఈ స్మాల్ క్యాప్ ఫండ్‌లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.500 కాగా లంప్సమ్ (LumpSum) పెట్టుబడి విలువ రూ.5,000గా ఉంది. ఈ ఫండ్‌లో నెలకు రూ.7,777 చొప్పున 15 సంవత్సరాల పాటు SIP చేసిన వ్యక్తి పెట్టుబడి విలువ రూ.13,99,860 కాగా అతనికి వచ్చిన రాబడి రూ.97,64,660గా ఉంది.
ఎస్బీఐ కన్సంప్షన్ ఆపర్చునిటీస్ ఫండ్ (SBI Consumption Opportunities Fund)
జులై 1999లో మార్కెట్లోకి వచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ 15 సంవత్సరాల క్యాల వ్యవధిలో ప్రతి ఏటా స్థిరంగా 18.91 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) రూ.201.3827 కాగా నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) విలువ రూ.3,074 కోట్లు. NIFTY India బెంచ్ మార్క్‌ను అందుకున్న ఈ మ్యూచువల్ ఫండ్ 1999 నుంచి ప్రతి ఏటా స్థిరంగా 16.15 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. 1.57 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉన్న ఈ స్మాల్ క్యాప్ ఫండ్‌లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.500 కాగా లంప్సమ్ (LumpSum) పెట్టుబడి విలువ రూ.5,000గా ఉంది. ఈ ఫండ్‌లో నెలకు రూ.7,777 చొప్పున 15 సంవత్సరాల పాటు SIP చేసిన వ్యక్తి రూ.67,48,725 రాబడిని పొందారు.

ఎస్బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ (SBI Healthcare Opportunities Fund)
జులై 1999లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ 15 సంవత్సరాల క్యాల వ్యవధిలో ప్రతి ఏటా స్థిరంగా 18.33 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ ఒక్కో యూనిట్ విలువ రూ. 440.298 కాగా నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) విలువ రూ.3460 కోట్లు. BSE Health Care బెంచ్ మార్క్‌ను అందుకున్న ఈ మ్యూచువల్ ఫండ్ 1999 నుంచి ప్రతి ఏటా స్థిరంగా 17.17 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. 1.95 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉన్న ఈ ఫండ్‌లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.500 కాగా లంప్సమ్ (LumpSum) పెట్టుబడి విలువ రూ.5,000గా ఉంది. ఈ ఫండ్‌లో నెలకు రూ.7,777 చొప్పున 15 సంవత్సరాల పాటు SIP చేసిన వ్యక్తి రూ.64,11,157 రాబడిని పొందారు.
ఎస్బీఐ టెక్నాలజీస్ ఆపర్చునిటీస్ ఫండ్ (SBI Technology Opportuities Fund)
జులై 1999లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ 15 సంవత్సరాల క్యాల వ్యవధిలో ప్రతి ఏటా స్థిరంగా 19.67 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ ఒక్కో యూనిట్ విలువ రూ.137.2867 కాగా ఫండ్ సైజు రూ.4,586 కోట్లు. BSE Teck TRI బెంచ్ మార్క్‌ను అందుకున్న ఈ మ్యూచువల్ ఫండ్ 1999 నుంచి ప్రతి ఏటా స్థిరంగా 16.08 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. 1.89 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉన్న ఈ ఫండ్‌లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.500 కాగా లంప్సమ్ (LumpSum) పెట్టుబడి విలువ రూ.5,000గా ఉంది. ఈ ఫండ్‌లో నెలకు రూ.7,777 చొప్పున 15 సంవత్సరాల పాటు SIP చేసిన వ్యక్తి రూ.72,19,221 రాబడిని పొందారు.
ఎస్బీఐ మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్ (SBI Magnum Midcap Fund)
మార్చి 2005లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ 15 సంవత్సరాల క్యాల వ్యవధిలో ప్రతి ఏటా స్థిరంగా 19.26 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ నికర ఆస్తి విలువ రూ.238.0124 కాగా నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) విలువ రూ.21,455 కోట్లు. NIFTY Midcap 150 బెంచ్‌మార్క్‌ను అందుకున్న ఈ మ్యూచువల్ ఫండ్ 2005 నుంచి ప్రతి ఏటా స్థిరంగా 17.38 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. 1.67 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉన్న ఈ ఫండ్‌లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.500 కాగా లంప్సమ్ (LumpSum) పెట్టుబడి విలువ రూ.5,000గా ఉంది. ఈ ఫండ్‌లో నెలకు రూ.7,777 చొప్పున 15 సంవత్సరాల పాటు SIP చేసిన వ్యక్తి రూ.69,60,467 రాబడిని పొందారు.
SBI ఫోకసుడ్ ఈక్విటీ ఫండ్ (SBI Focused Equity Fund)
అక్టోబర్ 2024లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ 15 సంవత్సరాల క్యాల వ్యవధిలో ప్రతి ఏటా స్థిరంగా 16.38 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ నికర ఆస్తి విలువ రూ.334.0881 కాగా నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) విలువ రూ.34,747 కోట్లు. BSE 500 TRI బెంచ్‌మార్క్‌ను అందుకుంది. 1.57 శాతం వ్యయ నిష్పత్తిని కలిగి ఉన్న ఈ ఫండ్‌లో కనీస ప్రారంభ పెట్టుబడి రూ.500 కాగా లంప్సమ్ (LumpSum) పెట్టుబడి విలువ రూ.5,000గా ఉంది. ఈ ఫండ్‌లో నెలకు రూ.7,777 చొప్పున 15 సంవత్సరాల పాటు SIP చేసిన వ్యక్తి రూ.54,06,827 రాబడిని పొందారు.
పాఠకులకు ముఖ్య గమనిక: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారు ముందుగా వాటి పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రాఫిట్ అనేది మార్కెట్ ఒడిదుడుకులపై ఆధార పడి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం నిపుణుల సలహాలు తీసుకోండి.