భారత దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) రాబోతోంది.ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (Reliance Jio Infocomm Ltd) మెగా IPOకు సిద్ధమవుతన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీ IPOకు రావొచ్చని, తద్వారా రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. IPOలో భాగంగా జియో మార్కెట్ విలువను రూ.10 లక్షల కోట్లుగా లెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పెట్టుబడిదారులకు పండుగే పండుగ.. Reliance Jio రూ.40,000 కోట్ల IPO!
