‘PM FME’ Scheme అంటే ఏంటి? ఏ విధంగా Apply చేయాలి? Subsidy ఎంత వస్తుంది?

Food Processing Unit Representation

దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించే సంకల్పంతో ‘ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్’ (PM FME) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. ఈ పథకం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహార శుద్ధి రంగం(Food Processing Sector)లో చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలను సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ‘PM FME’ పథకం దోహదపడుతుంది. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలకు ఈ స్కీమ్ ఓ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలు వారి వ్యాపారాభివృద్ధికి అవసరమైన సబ్సిడీ రుణాలను పొందే వీలుంటుంది. తద్వారా మెచినరీని అప్‌గ్రేడ్ చేసుకోవటంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే వీలుంటుంది. ఇదే సమయంలో సమాజంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

PM FME స్కీమ్ ద్వారా చేకూరే ప్రయోజనాలు ఇవే

35 శాతం వరకు మూలధన సబ్సిడీ: చిన్న, మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ‘PM FME’ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల వరకు లోన్ పొందే వీలుంటుంది. లోన్‌పై 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. దీనినే క్రెడిట్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అంటారు. మీరు తీసుకునే రూ.10 లక్షల లోన్‌లో రూ.3.5 లక్షలు కేంద్రమే చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సహకారంతో సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాల(machinery)ని కొనుగోలు చేయవచ్చు.

స్వయం సహాయక సంఘాల ఊతం :PM FME’ స్కీమ్ స్వయం సహాయక సంఘాలకు సైతం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మెంబర్ ‘సీడ్ క్యాపిటల్’ (Seed Capital) కింద రూ.40,000 వరకు పొందవచ్చు. ఈ మొత్తాన్ని వారు తమ వ్యాపారానికి అవసరమైన పనిముట్లను సమకూర్చుకునేందుకు వినియోగించుకోవచ్చు.

బ్రాండింగ్‌తో పాటు మార్కెటింగ్ సపోర్ట్ :PM FME’ స్కీమ్ కింద వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు తమ ఆహార ఉత్పత్తులకు సంబంధించి బ్రాండింగ్ ఇంకా మార్కెటింగ్ సపోర్ట్ కోసం 50 శాతం వరకు ఆర్థిక సహకారాన్ని పొందే వీలుంటుంది. తద్వారా ఆయా సంఘాలు తమ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునే అవకాశం లభిస్తుంది.

శిక్షణతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు :PM FME’ స్కీమ్ చిన్న, మధ్య స్థాయి పారిశ్రామికవేత్తలకు అవసరమైన ట్రైనింగ్‌తో పాటు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్స్‌ను ప్రత్యేకంగా సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills), మార్కెట్ వ్యూహాల(Marketing Strategies)ను పెంపొందించే విధంగా డిజైన్ చేయటం జరిగింది.

PM FME’ స్కీమ్‌కు ఎవరు అర్హులంటే?

ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా శాస్వత భారతీయ పౌరుడు (Permanent Indian Resident) అయి ఉండాలి. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో భాగమై ఉండాలి.

PM FME’ స్కీమ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే

ఆధార్ కార్డు (Aadhaar Card)

ఈమెయిల్ ఐడీ (Email ID)

మొబైల్ నంబర్ (Mobile Number)

కరెంటు బిల్ (Electricity Bill)

అడ్రెస్ ప్రూఫ్ (Adress Proof)

పాన్ కార్డ్ (PAN Card)

PM FME’ స్కీమ్‌ ముఖ్య బెనిఫిట్స్ ఇవే

ఒక జిల్లా ఒక ఉత్పత్తి (One District One Prouct) : PM FME’ స్కీమ్ ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ అనేక కీలక విధానంతో ముందుకు సాగుతోంది. ఈ అప్రోచ్ ఆయా ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపును తీసుకురావటంతో పాటు మార్కెట్ పరిధిని పెంచేందుకు దోహదపడుతుంది.

ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచటం : ఫైనాన్షియల్, టెక్నికల్ సపోర్టును అందించటం ద్వారా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మధ్య ఆరోగ్యవంతమైన పోటీతత్వాన్ని ‘PM FME’ స్కీమ్ పెంపొందిస్తోంది.

ఆర్థిక సహకారం :PM FME’ స్కీమ్ ద్వారా చిన్న, మధ్యతరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందే వీలుంటుంది. ఈ రుణంలో 35 శాతం వరకు క్రెడిట్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ లభిస్తుంది.

ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ :PM FME’ స్కీమ్‌లో భాగంగా పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు అవసరమైన శిక్షణ, విద్య వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది.

PM FME’ స్కీమ్‌‌కు ONLINEలో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

స్టెప్ 1: ముందుగా PMFME అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి

స్టెప్ 2: కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసేందుకు హోమ్ పేజీలో LOGIN సెక్షన్‌ కింద కనిపించే Register ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: రిజస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఓ కొత్త పేజీలోకి రీడైరెక్ట్ చేయబడతారు. అక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తదితర సమాచారాన్ని ఎంటర్ చేయాలి.

స్టెప్ 4: ఆ తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి.

సెప్ట్ 5: సమాచారం మొత్తం ఎంటర్ చేసిన తరువాత ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని Submit బటన్‌పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ చేయబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *