దేశవ్యాప్తంగా ఆన్లైన్ ట్రేడింగ్ (Online Trading) పట్ల రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు కూడా ఆన్లైన్ ట్రేడింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే ఈ సమాచారం మీకోసమే.
ఆన్లైన్ ట్రేడింగ్ (Online Trading) ప్రారంభించటానికి డీమ్యాట్ అకౌంట్ (Demat Account)తో పాటు ట్రేడింగ్ అకౌంట్ (Trading Account) తప్పనిసరి. వీటిని స్టాక్ బ్రోకర్ (Stock Broker) సంస్థల నుంచి పొందవల్సి ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసి ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. షేర్లకు సంబంధించిన క్రయ విక్రయాలను ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి చేయవచ్చు.

డీమ్యాట్ (Demat) అకౌంట్ అంటే ఏంటి?
‘డీమ్యాట్’ (DEMAT) అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్ (Dematerialised Account) అని అర్థం. డిజిటల్ వాల్ట్(Digital Vault)గా ఉపయోగపడే ఈ అకౌంట్ షేర్లు, బాండ్లు అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపరుస్తుంది. మన దేశంలో డీమ్యాట్ ట్రేడింగ్‌ను మొట్టమొదటి సారిగా 1996లో NSE లావాదేవీల కోసం పరిచయం చేశారు.
ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి?
ట్రేడింగ్ అకౌంట్‌ను ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అని కూడా పిలుస్తారు.ఈ అకౌంట్ ద్వారా పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు తదితర డిజిటల్ ఆస్తులను అమ్మవచ్చు లేదా కొనవచ్చు. ట్రేడింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడమే ఈ అకౌంట్ ముఖ్య ఉద్దేశం.
ఆన్లైన్ ట్రేడింగ్‌కు అవసరమైన 4 కీలకమైన స్టెప్స్ ఇవే
ఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థను ఎంపిక చేసుకోండి : స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ (Online Stock Brokerage Platform)ను ఎంపిక చేసుకుని అందులో డీమ్యాట్ అలానే ట్రేడింగ్ అకౌంట్లను ఓపెన్ చేయాలి. స్టాక్ బ్రోకరేజ్ సంస్థను ఎంపిక చేసుకునే ముందు వారి వార్షిక నిర్వహణ చార్జీలతో పాటు బ్రోకరేజీ చార్జీల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. పలు బ్రోకరేజీ సంస్థలు ట్రేడింగ్ వాల్యుమ్ను బట్టి చార్జీలు వసూలు చేస్తే, పలు సంస్థలు మాత్రం ట్రేడింగ్ వాల్యుమ్‌తో సంబంధం లేకుండా స్థిర ఛార్జీ(Flat Fee)ని వసూలు చేస్తాయి.

డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి: డీమ్యాట్ అలానే ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు మీరు ఆన్లైన్ ఫారంను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయటానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. అకౌంట్ ఓపెన్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ గైడ్..
ముందుగా మీరు ఎంపిక చేసుకున్న స్టాక్ బ్రోకర్‌కు సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ పేరు, ఈమెయిల్ ఐడీ, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేయాలి.
మీ ఐడెంటిటీని ధ్రువీకరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను సెలక్ట్ చేసుకుని సెల్ఫ్ వెరిఫికేషన్ (Self-Verification)ను పూర్తి చేయండి.
ఈ-సైన్ (E- Sign) ప్రక్రియను పూర్తి చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ప్రాసెస్ పూర్తయిన స్వల్ప వ్యవధిలోనే డీమ్యాట్ అలానే ట్రేడింగ్ అకౌంట్‌కు సంబంధించిన లాగిన్ క్రెడిన్షియల్స్ (Login Credentials) మీకు కేటాయించబడతాయి.
నగదు యాడ్ చేసి ట్రేడింగ్ ప్రారంభించండి : మీ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిన తరువాత అకౌంట్లోకి లాగిన్ అయి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఆ తరువాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్లోకి నగదు ట్రాన్స్ఫర్ చేసుకుని ట్రేడింగ్ జర్నీని ప్రారంభించండి.
మార్కెట్‌పై అవగాహన పెంచుకోండి : స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకునేవారికి మార్కెట్‌పై అవగాహన తప్పనిసరి. షేర్లకు సంబంధించిన మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకునే షేర్‌కు సంబంధించిన పూర్తి హిస్టారికల్ డేటాను ట్రేడింగ్ అకౌంట్లో చూసే వీలుంటుంది. కాబట్టి పూర్తిగా విశ్లేషణ చేసుకున్న తరువాతనే ట్రేడింగ్ జర్నీని ప్రారంభించటం మంచిది.

ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల చేకూరే ప్రయోజనాలివే!
మధ్యవర్తలు ఉండరు: ఆన్లైన్ ట్రేడింగ్‌లో మధ్యవర్తులు, బ్రోకర్లు, ఏజెంట్లు ఉండరు.ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్ మార్కెట్లను యాక్సెస్ చేసుకుని ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేయవచ్చు.
పేపర్ వర్క్ ఉండదు: ఆన్లైన్ ట్రేడింగ్ అలవాటు చేసుకోవడం వల్ల పేపర్ వర్క్‌తో పనే ఉండదు. లావాదేవీలు మొత్తం డిజిటల్ ఫార్మాట్లోనే జరుగుతాయి.
అనవసర ఖర్చులు ఉండవు: ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్టర్లకు అనవసర ఖర్చులు ఉండవు. ఎవరికీ కమీషన్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కావల్సినంత సమాచారం దొరుకుతుంది: మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా వరకు ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థలు ట్రేడింగ్‌కు అవసరమైన ఎడ్యుకేషనల్ రోసోర్సులను ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా ఇన్వెస్టర్లు సమర్థవంతమైన మార్కెట్ వ్యూహాలను అలవాటు చేసుకోవచ్చు.

ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎంపిక చేసుకోవటం ఎలా?
సమర్థవంతమైన స్టాక్ ట్రేడింగ్‌కు వివిధ విశ్లేషణ పద్ధతులను అనుసరించటం తప్పనిసరి. వాటిలో Fundamental అదే విధంగా టెక్నికల్ (Technical) అనాలసిస్ చాలా ముఖ్యమైనవి.
ఫండమెంటల్ అనాలసిస్ (Fundamental Analysis): స్టాక్ మార్కెట్లో రాణించాలనుకునే వారు తప్పనిసరిగా కంపెనీల స్థితిగతులపై విశ్లేషణ చేయాలి. మంచి షేర్‌ను గుర్తించటం ఎంత ముఖ్యమూ, ఓపికగా ఎదురు చూడటం కూడా అంతే ముఖ్యం. మీకు నచ్చిన షేరు విలువ బాగా పెరిగినప్పుడు తొందరపడి అధిక రేట్లకు కొనకండి. ధర డౌన్ అయినప్పుడు మాత్రమే కొనుగోలు అవకాశంగా భావించండి.
టెక్నికల్ అనాలిసిస్ (Technical Analysis): బొలింగర్ బ్యాండ్స్, MACD, క్యాండిల్ స్టిక్ వంటి చార్ట్స్‌ను ఫాలో అవ్వటం ద్వారా షేర్లకు సంబంధించిన ప్రైస్ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
పాఠకులకు ముఖ్య గమనిక: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారు ముందుగా వాటి పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రాఫిట్ అనేది మార్కెట్ ఒడిదుడుకులపై ఆధార పడి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం నిపుణుల సలహాలు తీసుకోండి.