బీఏ, బీకామ్, బీఈడి , బీఎస్సీ, టెన్త్, అర్హతలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India)లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 29, 2025. Central Bank of India Recruitment 2025కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్/సబ్‌స్టాఫ్, వాచ్మెన్/గార్డనర్ పోస్టులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏ వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయో పరిమితి (Age Limit) 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వయసు సడలింపు (Age Relaxation) బ్యాంకు నియమాలకు అనుగుణంగా నిర్ణయించబడుతుంది.
జీత భత్యాల వివరాలు :
అటెండర్/సబ్‌స్టాఫ్, వాచ్మెన్/గార్డనర్‌కు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నెలకు రూ.8,000 చెల్లిస్తారు. ఫ్యాకల్టీకి నెలకు రూ.20,000 చొప్పున, ఆఫీస్ అసిస్టెంట్‌కు నెలకు రూ.12,000 చొప్పున చెల్లిస్తారు.
విద్యార్హతలు :
పోస్ట్: ఫ్యాకల్టీ
విద్యార్హతలు : గ్రామీణ అభివృద్ధి/ సోషియాలిజీ లేదా సైకాలజీలో ఎంఏ (MA) పూర్తి చేసి ఉండాలి. లేని పక్షంలో బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఏ విత్ బీఈడి క్వాలిఫికేషన్‌ను కలిగి ఉండాలి.
పోస్ట్: ఆఫీస్ అసిస్టెంట్
అర్హతులు: బీఏ, బీకామ్ లేదా బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ పట్ల అవగాహన తప్పనిసరి.
పోస్ట్: అటెండర్/సబ్‌స్టాఫ్
అర్హతలు: పదో తరగతి పాసై ఉండాలి.
పోస్ట్: వాచ్మెన్/గార్డనర్
అర్హతలు: కనీసం ఏడో తరగతి పాసై ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదే విధంగా తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఈ క్రింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Regional Manager/Co-Chairman, Dist. Level RSETI Advisory Committee (DLRAC), Central Bank of India, Regional Office.
Regional Manager
Central Bank Of India ,Regional Office
1st Floor, Patel Chowk, Near HPO, Siwan , PIN – 841226