దేశంలోని నిరుద్యోగ యువతకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (Border Roads Organization) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 411 ఖాళీలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మల్టీ స్కిల్డ్ వర్కర్ రిక్రూట్‌మెంట్ 2025 పూర్తి సమాచారం
నోటిఫికేషన్ విడుదల తేదీ: జనవరి 2, 2025
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 11, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2025
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2025
పరీక్ష తేదీ : ఇంకా వెల్లడి కాలేదు
అడ్మిట్ కార్డులను పరీక్షకు ముందు విడుదల చేస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంతంటే?
జనరల్ (Genaral), ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ (OBC): రూ.50
SC, ST: ఉచితం
పేమెంట్ మోడ్ (ఆన్‌లైన్): డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, మొబైల్ వాలెట్
వయసు పరిమితి (Age Limit) ఎంత?
కనీస వయసు (Minimum Age): 18 సంవత్సరాలు
గరిష్ఠ వయసు (Maximum Age): 25 సంవత్సరాలు
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయసు సడలింపు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మల్టీ స్కిల్డ్ వర్కర్ రిక్రూట్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

ఉద్యోగాల సంఖ్య, కేటగిరీల వారీగా కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి
మొత్తం 411 మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీల వారీగా చూస్తే జనరల్ (Genaral)కి 205, ఈడబ్ల్యూఎస్ (EWS)కి 19, ఓబీసీ (OBC)కి 96, ఎస్సీ (SC)కి 62, ఎస్టీ(ST)కి 29 పోస్టులు కేటాయించారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే
ఎంఎస్‌డబ్ల్యూ (Cook): 153
ఎంఎస్‌డబ్ల్యూ (Mason): 172
ఎంఎస్‌డబ్ల్యూ (BlackSmith): 75
ఎంఎస్‌డబ్ల్యూ (Mess Waiter): 11
పోస్టుల వారీగా కావల్సిన విద్యార్హతలు
ఎంఎస్‌డబ్ల్యూ (Cook): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. ఇదే సమయంలో కుక్ ట్రేడ్‌లో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి.
ఎంఎస్‌డబ్ల్యూ (Mason): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. ఇదే సమయంలో ITI లేదా భవన నిర్మాణ రంగంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి.
ఎంఎస్‌డబ్ల్యూ (BlackSmith): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. ఇదే సమయంలో ITI లేదా కంసాలి వృత్తిలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి.
ఎంఎస్‌డబ్ల్యూ (Mess Waiter): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. ఇదే సమయంలో సంబంధిత వృత్తిలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ఆసక్తి గల అభ్యర్థులు https://marvels.bro.gov.in/ అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి సంబంధిత లింక్స్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని https://marvels.bro.gov.in/Download/Recruitment_Activities_Against_Advt_No01_2025.pdf పేజీలో చూడొచ్చు.
ఎంపిక విధానం (Mode of Selection) ఏ విధంగా ఉంటుందంటే?
- రాత పరీక్ష
- స్కిల్ టెస్టు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు
Q.) BRO MSW రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది?
Ans.) జనవరి 11, 2025
Q.) BRO MSW రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తుకు చివరి తేదీ ఏది?
Ans.) ఫిబ్రవరి 24, 2025
Q.) BRO MSW రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తుకు ఏజ్ లిమిట్ ఎంత?
Ans.) కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.
Q.) BRO MSW రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తుకు విద్యార్హతలు ఇవే?
Ans.) తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. ఇదే సమయంలో సంబంధిత వృత్తిలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి.