మీ ఆధార్ కార్డ్ Misuse అయ్యిందా? ఇలా చెక్ చేసుకోండి

భారతీయులకు ‘ఆధార్’ (Aadhaar) అనేది ఓ కీలకమైన డాక్యుమెంట్. 12 అంకెలతో కూడిన ఆధార్ నంబర్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి బ్యాంకింగ్, ఇంటర్నెట్ ఇలా ఏ సర్వీస్ పొందాలన్నా ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరిగా మారిపోయింది.

ఓ వ్యక్తికి సంబంధించిన అత్యంత విలువైన, వ్యక్తిగత సమాచారాన్ని క్యారీ చేసే ఆధార్‌ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పొరపాటున ‘ఆధార్’ (Aadhaar) దుర్వినియోగం అయితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ ఐడెంటిటీని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా వినియోగించే ప్రమాదముంది. కాబట్టి, ఆధార్ వినియోగం విషయంలో అత్యంత గోప్యత అవసరం. ఈ కథనంలో ఆధార్ కార్డ్ దుర్వినియోగాన్ని ఏ విధంగా అరికట్టాలి, ఆధార్ కార్డ్ Misuse అయ్యిందా? లేదా? వంటి విషయాన్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

మీ ఆధార్ కార్డు Misuse అయ్యిందో.. లేదో ఈ విధంగా తెలుసుకోండి

STEP 1 : ముందుగా myAadhaar పోర్టల్‌లోకి వెళ్లండి.

STEP 2 : ఆ పేజీలో కనిపించే లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ అదే విధంగా క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ ప్రాసెస్ పూర్తయిన తరువాత ‘Login With OTP’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

STEP 3: ఇప్పుడు మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓ OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి మీ ఆధార్ అకౌంట్‌లోకి యాక్సిస్ చేయండి.

STEP 4: మీ ఆధార్ అకౌంట్‌లోకి లాగిన అయిన తరువాత మెనూలో కనిపించే ‘Authentication History’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

STEP 5: తేదీలను సెలక్ట్ చేసుకుని ఆధార్ యూసేజ్ సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా అనధికారిక వినియోగాన్ని గుర్తించినట్లయితే UIDAI వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.

మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్స్‌ను ఈ విధంగా ఆన్‌లైన్‌లో LOCK చేసుకోండి

STEP 1 : ముందుగా myAadhaar పోర్టల్‌లోకి వెళ్లండి.

STEP 2 : పోర్టల్‌లో కనిపించే ‘Lock/Unlock Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సంబంధిత గైడ్‌లైన్స్‌ను పూర్తిగా అర్థం చేసుకుని ‘Next’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

STEP 3 : ఆ తరువాత ఓపెన్ అయ్యే పేజీలో మీ ఆధార్ వర్చువల్ ఐడీ (VID)తో పాటు మీ పూర్తి పేరు, పిన్ కోడ్ అదే విధంగా captcha కోడ్‌ను ఎంటర్ చేయండి.

STEP 4 : ఇప్పుడు ‘Send OTP’ ఆప్షన్‌పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓ OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి ‘ Submit’ ఆప్షన్‌పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్స్ విజయవంతంగా లాక్ అవుతాయి.

ఆధార్ కార్డు Misuseని ఎలా రిపోర్ట్ చేయాలంటే?

మీ ఆధార్ కార్డు Misuse అయితే వెంటనే ఈ విధంగా స్పందించిండి.

స్టెప్ 1: మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయినట్లు తెలిసిన వెంటనే ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 1947కు డయల్ చేయండి.

స్టెప్ 2: అదే విధంగా మీ సమస్యను help@uidai.gov.inకు మెయిల్ చేయండి.

స్టెప్ 3: ఒకవేళ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలనుకుంటే UIDAI వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్‌ను సందర్శించి రిపోర్ట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *