ప్రపంచంలోనే హయ్యెస్ట్ శాలరీ అందుకుంటున్న వ్యక్తిగా భారత్ కు చెందిన జగదీప్ సింగ్ రికార్డు నెలకొల్పారు. జగదీప్ సింగ్ ఏకంగా ఏడాదికి రూ.17,500 కోట్ల వేతనం అంటే రోజుకు రూ.48 కోట్లు చొప్పున అందుకుంటున్నారట. ఇంతకీ జగదీప్ సింగ్ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు.. ఆ ఉద్యోగానికి ఎందుకంత డిమాండ్ వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ‘క్వాంటమ్‌స్కేప్’ (Quantumscape) కంపెనీకి జగదీప్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. 2010 నుంచి సేవలందిస్తున్న ఈ సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సాలిడ్ స్టేట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ బ్యాటరీలు సాంప్రదాయ లిథియం – అయాన్ బ్యాటరీలతో పోలిస్తే వేగంగా ఛార్జ్ అవ్వటంతో పాటు మెరుగైన బ్యాటరీ బ్యాకప్ అలానే మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ రివల్యూషన్ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ సంస్థ ముందంజలో కొనసాతుండటంతో బిల్ గేట్స్, వోక్స్ వ్యాగస్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 16న ‘క్వాంటమ్‌స్కేప్’సంస్థకు CEOగా రాజీనామా చేసిన జగ్దీప్ సింగ్ ఆ బాధ్యతలను శివ శివరామ్‌కు అప్పగించారు.