దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. భారత దేశ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ఆధార్ ను ఓ ధ్రువీకరణగా పరిగణిస్తున్నారు. దీంతో ఆధార్ వివరాలను అడిగిన చోటల్లా సమర్పిస్తున్నాం. ఈ క్రమంలో పలు సందర్భాల్లో డేటా దుర్వినియోగం అవుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఓ ఐడీ నంబర్‌ను కేంద్రం తీసుకువచ్చింది. ఈ సంఖ్యను వర్చువల్ ఐడీ అంటారు. వర్చువల్ ఐడీ అనేది ఆధార్ కార్డుతో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య. ఆధార్ నంబర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా EKYC వంటి వాటి కోసం కూడా ఈ ఐడీ వినియోగించవచ్చు. ఆధార్ నంబర్ స్థానంలో వర్చువల్ ఐడీ నంబర్‌ను ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లదు.

ఆధార్ వర్చువల్ ఐడీని ఎలా పొందాలంటే?
ముందుగా ఆధార్ (https://uidai.gov.in/en/) అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి.

లాగిన్ అయిన తరువాత ఆధార్ సర్వీసెస్ (Aadhaar Services) సెక్షన్లో కనిపించే ‘వర్చువల్ ఐడీ జనరేటర్’ (Virtual ID (VID) Generator) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

‘వర్చువల్ ఐడీ జనరేటర్’ పేజీలోకి వెళ్లిన తరువాత మీ ఆధార్ నంబర్‌తో పాటు అక్కడ కనిపించే క్యాప్చా (Captcha) కోడ్‌ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పొందిపర్చిన అనంతరం వెరిఫై అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు 16 అంకెల వర్చువల్ ఐడీ నంబర్ కనిపిస్తుంది.అంతేకాకుండా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం కూడా వస్తుంది.