ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వై-ఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. వై-ఫై సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్‌తో కనెక్ట్ కావచ్చు. నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకునే వీలుంటుంది. ఇంట్రడ్యూసరీ పీరియడ్‌లో భాగంగా ఈ వై-ఫై సేవలను కాంప్లిమెంటరీగా అందించనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Air India విమానాల్లో ఇక WiFi సేవలు
