డిజిటల్ ఇండియా విప్లవంలో భాగంగా దేశంలో ఆన్‌లైన్ పేమెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. UPI లావాదేవీలు 2024, డిసెంబర్‌లో 8 శాతం ఎగసి 1,673 కోట్లుగా నమోదయ్యాయి. 2016లో భారత్‌లో UPI లావాదేవీలు మొదలైన నాటి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వివరాల ప్రకారం గత ఏడాది మొత్తంగా దేశంలో 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోల్చితే ఇది 46 శాతం ఎక్కువ.
భారత్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన UPI పేమెంట్స్
